ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది .
విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ నివాసి సాగంటి ఏశయ్య ఉదయం అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమారులు కుమారు ,మణి జనగామలో ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు .అయితే ఏశయ్యకు బీపీ పెరగడంతో డాక్టర్లు వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు .అయితే అక్కడ ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో కుమారులు ఇద్దరు తమ తండ్రిని భుజాలపై ఎక్కించుకొని మరి సిద్ధిపేట రోడ్డు వద్దకు వచ్చారు .
మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు .ఆస్పత్రికి వెళ్ళాలి .అన్నా ప్లీజ్ రారా అని ఆటో దగ్గర నుండి కార్ల వరకు అందర్నీ బ్రతిమిలాడారు .అయిన కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు .మద్యలో ఎమన్నా అయితే మనకు ఎమన్నా అవుతుందేమో అని భయపడ్డారు ఏమో కానీ ఎవరు ముందుకు రాలేదు .దీంతో ఎవరు ముందుకు రాకపోవడంతో ఇద్దరు కుమారులు చేరి కాసేపు ఒకరి భుజాలపై ఒకరు ఎత్తుకొని జనగాం ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎత్తుకొని వెళ్లారు .అక్కడ నుండి వరంగల్ కు బస్సులో తీసుకెళ్లడం అక్కడ స్థానికులకు ,బస్సులోని ప్రయాణికుల మదిని కలిచివేసింది .