నాగ్ పూర్ టెస్టులో మూడో రోజూ అదే జోరు కొనసాగిస్తోంది టీమిండియా. 312/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్… భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. రెండో రోజు సెంచరీలతో అదరగొట్టిన భారత బ్యాట్స్ మెన్.. మూడో రోజూ సెంచరీతో మెరిశారు. కెప్టెన్ కోహ్లీ 130 బంతుల్లో 10 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. కోహ్లీకిది 19వ సెంచరీ. అంతేకాదు…. ఒకేఏడాదిలో 10 సెంచరీల ఘనత కూడా సొంతం చేసుకున్నాడు కోహ్లీ. దీంతో రికీపాంటింగ్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ గా పది సెంచరీలు పూర్తిచేసుకున్న క్రికెటర్ గా రికార్డులకెక్కాడు కోహ్లీ.
