మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరా భవన్‌లో పవర్ ప్రజంటేషన్ ఇచ్చింది .ఈ సందర్భంగా టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాన ప్రతిపక్షం ఐనటువంటి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించకపోవడ0 దారుణమని అన్నారు . మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని అయన అన్నారు . 2014 డిసెంబర్ నాటికే మెట్రో రైల్ అందుబాటులోకి రావాల్సి ఉంది కాని టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని అయన ఆరోపించారు.పాతబస్తీలో మెట్రో రైల్ ఎందుకు ఆగిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.