తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28న ప్రారంభం కానున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్న విషయం తెల్సిందే .అయితే ఈ సదస్సుకు హాజరు కానున్న ఇవాంకా ట్రంప్ కు ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న విందు మెనూ సిద్ధమైంది. ఆమెకు మరపురాని ఆతిథ్యం ఇవ్వాలని భావించిన సర్కారు తరఫున మంత్రి కేటీఆర్ దగ్గరుండి మెనూను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పేరును షెఫ్ లు ఈ వంటకాలను సిద్ధం చేయనున్నారు. మెనూలో ధమ్ కి బిర్యానీ, హలీం, షీక్ కబాబ్, మటన్ మురగ్, మటన్ కోఫ్తా, మొగలాయి మటన్, మొగలాయి చికెన్, ఖుబానీ కా మీఠా, డ్రై ఫ్రూట్స్ ఖీల్, నాన్ రోటి, రుమాలి రోటీ, పరాఠా, బగారా బైగన్, రైతాలతో పాటు మరిన్ని వెరైటీలు సిద్ధం కానున్నాయి. హైదరాబాద్ వంటలతో పాటు అమెరికన్ రుచులనూ తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని అతిపెద్ద డైనింగ్ టేబుల్ గా పేరు తెచ్చుకున్న ఫలక్ నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ పై ఈ వంటకాలను ఇవాంకాతో పాటు ముఖ్యమైన అతిథులు కొందరికి వడ్డించనున్నారు.