ప్రధాన మంత్రి అయిన నరేందర్ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .ఈ ఎన్నికల్లో గెలవాలని ఇటు ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పోటి పడి మరి దూసుకుపోతున్నాయి .తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు .ప్రచారంలో భాగంగా రాహుల్ అహ్మదాబాద్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు .
ఈ సమయంలో కార్యకర్తలు తమ తమ సమస్యలను రాహుల్ కు వివరిస్తున్నారు .ఆ సందర్భంలో రంజనా ఆశ్వతి అనే మహిళా లేచి తన కష్టాలను తెలియజేస్తూ నేను సరిగ్గా ఇరవై మూడు ఏళ్ళ నుండి పార్ట్ టైం టీచర్ గా కెరీర్ ను మొదలుపెట్టాను .అప్పట్లో నాకు కేవలం రెండు వేల ఐదు వందలు ఇచ్చేవారు .ప్రస్తుతం పన్నెండు వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నాను .
ప్రతి మహిళకు ప్రసూతి సెలవులు తప్పక ఇస్తారు .అయితే ఈ ప్రభుత్వం మాత్రం నాకు ప్రసూతి సెలవు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది అని తీవ్ర ఉద్వేగంతో చెప్పింది .అప్పటివరకు వేదికపై ఉన్న రాహుల్ తట్టుకోలేక ఒక్కసారిగా కిందికి దిగొచ్చి ఆమెను ఆలింగనం చేసుకున్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక చర్య పది మాటలు కంటే ఎక్కువ ధైర్యాన్నిస్తుంది అని అన్నారు .