ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తోన్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిగా శ్రీదేవిను ప్రకటించాడు .
తాజాగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు కర్నూలు లేదా అనంతపురం లోక్ సభ అభ్యర్ధి ఎవరో ప్రకటించారు .అయితే ఈ రెండు స్థానాల్లో ఎక్కడ నిలబెడతారో చెప్పకపోయిన కానీ టికెట్ మాత్రం ఏ సామాజిక వర్గానికి ఇస్తారో తేల్చేశారు .ఈ క్రమంలో గోరంట్లలో జరిగిన బీసీ సంఘం ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు .
నేను అలాంటి మోసపూరిత హామీలను ఇవ్వను .రానున్న కాలంలో బోయలకు న్యాయం చేస్తాను .ప్రతిజిల్లాలో బీసీ కమిటీలను ఏర్పాటు చేస్తాను .రాబోయే ఎన్నికల్లో కర్నూలు లేదా అనంతపురం జిల్లా నుండి ఎంపీ టికెట్ బోయలకు కేటాయిస్తాను ప్రకటించారు .