రకుల్ ప్రీత్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సన్నజాజి తీగలా సన్నగా ఉంటూ ..తన అందంతో యువతను మదిని దోచుకున్న అందాల రాక్షసి .ఇండస్ట్రీలోకి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో సినిమాలల్లో నటించే స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీలో టాప్ టెన్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ .
ఇలాంటి రకుల్ తన వివాహం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది .ఒక ప్రముఖ వార్త పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన వివాహం గురించి ..చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసింది .ఆ ఇంటర్వ్యూ లో మీరు హైదరాబాద్ కోడలు అవుతారా అని అడిగితె అమ్మడు మాట్లాడుతూ ప్లీజ్ మా అమ్మగారికి చెప్పండి .నేను హైదరాబాద్ లో సెటిల్ అయ్యేవార్ని చేసుకుంటా ..నా హోమ్ టౌన్ ఢిల్లీ అయిన కానీ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం .
ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకొని నార్త్ లో సెటిల్ అవ్వాలని అమ్మ అంటుంది .కానీ నేను ఒకవేళ నేను నార్త్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడకే వచ్చి సెటిల్ అవుతా అని అమ్మడు తన మదిలో మాట చెప్పేసింది .అయితే ఇంటర్వ్యూయర్ మీరు తెలుగు వాళ్ళను చేసుకుంటారా అని అడిగితే చిరునవ్వు నవ్వుతూ ఏమో చెప్పలేను మనస్సుకు నచ్చితే తెలుగు వారా పంజాబీ వారా అని చూడను కానీ మొత్తానికి ఇక్కడే సెటిల్ అయిన వార్ని చేసుకుంటా అని పరోక్షంగా క్లూ ఇచ్చింది ఈ అందాల రాక్షసి ..