రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రేపు సోమవారం అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .
అయితే ,ఎమ్మెల్యే ఈశ్వరీ పార్టీ మార్పుపై క్లారీటీ ఇచ్చారు .ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ “పార్టీ మారుతున్నాను అని వస్తున్న వార్తలు నిజమే .నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాను .నియోజక వర్గంలో అనుచరవర్గం ,కార్యకర్తల కోరిక మేరకే పార్టీ మారుతున్నాను .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న తీరు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది .
అందుకే నియోజక వర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను అని ఆమె తెలిపారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా చంద్రబాబు సర్కారు పలు అవినీతి అక్రమాలపై పోరాడిన ఈశ్వరీ ఇప్పుడు అకస్మాత్తుగా బాబు చేసిన అభివృద్ధి ,సంక్షేమం ఎక్కడ కనిపించిందో మరి ..లేదా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కదు అని అలోచించి ఇలా పార్టీ మారుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు .