ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై ఒక్కమంది అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అందులో ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులిచ్చి సత్కరించాడు .
అయితే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే రేపు సోమవారం 27న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు అని బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .అందులో భాగంగా రాష్ట్రంలో పాడేరు నియోజక వర్గం నుండి వైసీపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరి రేపు సోమవారం ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు అని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .అంతే కాదు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరతారు అని కూడా మంచి మసాలా వేసి మరి వార్తలను ప్రచురించింది ..