జబర్దస్త్ లో ఇటీవల ప్రసారమైన ‘అనాధాశ్రమం’ స్కిట్ వివాదంపై యాంకర్ అనసూయ స్పందించింది.పేస్ బుక్ లైవ్ ద్వారా ప్రేక్షల ముందుకు వచ్చిన ఆమె, తెలుగు సినీ పరిశ్రమకు బాహుబలి సినిమా ఎంత గుర్తింపు తెచ్చిందో, టీవీ ఇండస్ట్రీకి జబర్దస్త్ అలాంటి గొప్ప పేరు తెచ్చిందని అన్నారు . అంత పేరు తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం క్రియేటివిటీని చంపేయవద్దని ఆమె కోరారు.ఆది టీం చేసిన స్కిట్ ను సమర్ధిస్తూ అందరూ అనాథశ్రమంకి వెళ్లిన వేళ, అక్కడున్న వారిని ఉద్ధేశించి లీడ్ కోసం అలాంటి డైలాగులు రాసుకున్నారే తప్ప, ఎవరినీ కించపరిచేందుకు కాదని, తమ ఉద్దేశం నవ్వించడమేనని చెప్పుకొచ్చింది. జీవితంలో వచ్చే విషయాలనే మేము చూపిస్తున్నాం. అంతలా నవ్విస్తుంటే మీరు ఏడిపించడం ఏమైనా బాగుందా అని ప్రశ్నించారు.
Posted by Anasuya Bharadwaj on Saturday, 25 November 2017