కొద్దిరోజులుగా అస్పష్టత, అనుమానలు, ఆశల మధ్య కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన విషయంలో ఉత్కంఠకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు.
మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. 2.20 గంటలకు ఆడియో విజువల్ ప్రజంటేషన్, మెట్రో రైల్ యాప్, బ్రోచర్‌ను విడుదల చేస్తారు. మ. 2.30 నుంచి 2.40 గంటల వరకు మియాపూర్ – కూకట్‌పల్లి, కూకట్‌పల్లి – మియాపూర్ మధ్య మెట్రో రైలులో మోదీ ప్రయాణించనున్నారు.అనంతరం జీఈఎస్ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 2.55 గంటలకు మియాపూర్ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.
అనంతరం మ. 3.35 నుంచి 3.55 గంటల వరకు ఇవాంక ట్రంప్‌తో మోడీ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సు ముగిసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు రహదారి మార్గంలో ఫలక్‌నూమా ప్యాలెస్‌కు ప్రధాని బయల్దేరనున్నారు. రాత్రి 10 గంటల వరకు ఫలక్‌నూమా ప్యాలెస్‌లో మోడీ ఉండనున్నారు. రాత్రి 10.25 గంటలకు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు.