అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు కిక్ ఇచ్చే యాంకర్, నటి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మీ. జబర్దస్త్ పుణ్యమా అంటూ వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుంటూ తను ఇంటర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంకర్ రష్మీ. అందులోను తను నటించిన చిత్రాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ యాంకర్ కమ్ యాక్టర్ అంటూ ప్రశంసలందుకుంటోంది.
రష్మీ తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిన మాట ఎంత వాస్తవమో.. అదే స్థాయిలో రష్మీపై గాసిప్స్ వచ్చాయన్న మాట కూడా అంతే వాస్తవం. మొన్నటికి మొన్న బ్రహ్మాజీ రష్మీ మధ్య ఎఫైర్ అంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అంతకు ముందు సుధీర్ రష్మీ పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. తీరా అవన్నీ పుకార్లేనని తేల్చేశారు బ్రహ్మాజీ, సుధీర్, రష్మీ.
అయితే, తాజాగా రష్మీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనపై వచ్చిన వ్యభిచార కథనాలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. వ్యభిచారం కేసులో పట్టుబడ్డ రష్మీ.. అది నిజమేనా! ఈ విషయంపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది దీనిపై మీ స్పందన అన్న ప్రశ్న రష్మీకి ఎదురైంది. అవును వ్యభిచారం చేస్తున్నానంటూ చెప్పింది రష్మీ. అంతటితో ఆగక మీకేంటి అంటూ ఎదురు ప్రశ్నించింది. నా గురించి గాసిప్స్ రాయమన్నాను కానీ.. మరీ ఇంత దిగజారుడుతనంగా కాదు అంటూ సమాధానం ఇచ్చింది రష్మీ. మీడియా వాళ్లకు ఒకటే చెబుతున్నా.. నా గురించి ఏమైనా రాసుకోండి.. నాకు పబ్లిసిటీ తీసుకురండి అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ కమ్ సినీ నటి రష్మీ. మీడియా వ్యాఖ్యలను ఖండించాల్సిన రష్మీనే .. ఇలా డైరెక్ట్‌గా క్లూ ఇవ్వడం ఏంటని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.