ఈనెల 28వతేదీన హైదారాబాద్ మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ను మంత్రులు కే. తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం సందర్శించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మంత్రులతోపాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ప్రయాణించారు.
