ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే రెండు వందల కిలోమీటర్ల మైళ్లను దాటేశాడు .ఈ తరుణంలో అధికార పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి ..
అందులో భాగంగా పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎంవీఆర్(మండవ వెంకట్రామ్ చౌదరి) చౌదరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఈ నెల 29న చౌదరి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది.
ఏళ్ల తరబడి టీడీపీకి సేవలందించినా తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.అయితే ఎంవీఆర్ చౌదరి కంటే ముందుగా నియోజకవర్గంలోని మరో బలమైన నాయకుడు వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ నాయకుడి నుంచి పార్టీ మార్పుపై ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ అందలేదని తెలుస్తోంది.