విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభం పట్ల ప్రజల్లో చాలా ఉత్సుకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియా మెట్రో పట్ల ఇచ్చిన సానుకూల ప్రచారంతో పాజిటిన్ రెస్పాన్స్ వచ్చిందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి మెట్రోలో జర్నీ చేసిన మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రయాణ అనుభూతి కోసం ప్రజాప్రతినిధులను తిప్పామని అన్నారు. ఈనెల 28న మియాపూర్లో మధ్యాహ్నం 2.15 మెట్రో రైల్ ను ప్రధాని మెడీ, సీఎం కేసీఆర్ కలిసి ప్రారంభిస్తారని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా..30 కిలోమీటర్ల స్ట్రెచ్ ప్రజలకు అందుబాటులోనికి వస్తోందని..29 నుంచే ప్రజలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ప్రజల ఉపయోగించుకోవచ్చునని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో ప్రపంచంలో అతిపెద్ద PPP మోడ్లో చేపట్టిన ప్రాజెక్టు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. వేలాది మంది సిబ్బంది కష్టపడి ప్రధానిచే ప్రారంభం కోసం పనిచేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని రకాల సేఫ్టి సర్టిఫికెట్లులు వచ్చాయన్నారు. మెట్రోను నగర ప్రజలు ఇంటిలాగా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు.
మన దగ్గర 57 రైళ్లు ఉన్నాయని పేర్కొంటూ…ఒక్కో రైల్లో 3 కోచ్ లు ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. 1000 మంది ప్రయాణం చేయవచ్చని అవసరాన్ని రద్దీని బట్టి 6 కోచ్ లకు పెంచుకుంటే 2000 మంది ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. అన్ని స్టేషన్లకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోందన్నారు. ఉబర్, మహేంద్ర సంస్థలు బ్యాటరీ వాహణాలు అందుబాటులోనికి తీసుకు వస్తున్నారని తెలిపారు. స్మార్టు కార్డు వల్ల మల్టిమెడ్ ట్రాన్స్ పోర్టు కోసం వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి మెట్రో స్టేషను ఫుట్ ఓవర్ బ్రిడ్జిలాగా ఉపయోగించవచ్చునని తెలిపారు. కొన్ని స్టేషన్ల వద్ద స్కై వాక్ లు ఏర్పాట్లు చేస్తామని…స్టేడియం వద్ద IT SEZలు..షాపింగ్ కాంప్లెక్స్ వద్ద స్కై వాక్ లు వస్తాయన్నారు. పార్కింగ్ కోసం పక్కా ఏర్పాట్లున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
టీ సవారీ పేరుతో మెబైల్ యాప్ తెస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందులో జర్నీ డిటైల్స్ తెలుస్తాయన్నారు. ఆ యాప్‌ను ప్రధాని, సీఎం కేసీఆర్ మెట్రో ప్రారంభం రోజున ఆవిష్కరిస్తారన్నారు. మెట్రోతో నగర అభివృద్ధ మరో 10-15% ఊపందుకుంటుందన్నారు. టికెట్టు ధరల గూర్చి ఈరోజు సాయంత్రం లేదా రేపు L&T వారు ప్రకటిస్తారని మంత్రి ప్రకటించారు.
Cabinet Ministers, MPs, MLAs, MLCs and elected representatives from Hyderabad city took a test ride on #HyderabadMetro from Nagole to Mettuguda today @hmrgov @ltmhyd pic.twitter.com/d4CJLPiOgz
— Min IT, Telangana (@MinIT_Telangana) November 25, 2017