వచ్చే (2018) ఏడాదిలో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులు ఇవ్వగా, అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ హాలిడేస్) 22 ఇవ్వగా, అందులో ఒక రెండో శనివారం మిగిలిన నాలుగు ఆదివారాలు ఉన్నాయి.
ఐచ్ఛిక సెలవులు: జనవరి 16న కనుమ, 22న శ్రీపంచమి, ఫిబ్రవరి 1న హజ్రత్ సయ్యద్ మహ్మద్ జన్మదినం, మార్చి 29న మహావీర్ జయంతి, ఏప్రిల్1న హజ్రత్ అలీ జన్మదినం, 15న షబ్‌ఏ మెరాజ్, 18న బసవ జయంతి, 29న బుద్ధ పూర్ణిమ, మే2న షబ్ ఈ బరాత్, జూన్5న షాదత్ అలీ, 12న షాబ్ ఏ ఖదీర్, 15న జుమా అతుల్ వాదా, జూలై14న రథయాత్ర, ఆగష్టు 17న పార్శీల నూతన సంవత్సరం, 24న వరలక్ష్మీ వ్రతం, 26న రాఖీపౌర్ణమి, 30న ఈద్‌ఏ గదీ, సెప్టెంబర్ 20న మొహర్రం, అక్టోబర్ 30న అరెబయీన్, నవంబర్6న నరక చతుర్దశి, డిసెంబర్19న యాజ్ దహుమ్ షరీఫ్, 24న క్రిస్మస్ ఈవ్.