సోషల్ మీడియా ..ఇది నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అత్యంత వేగంగా విషయ ప్రచారానికి ..నిజనిజాలు పది మందికి చేరే విధంగా ఉపయోగపడేది .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏవిధంగా అయితే కొన్ని సత్యాలు ..కొన్ని అసత్యాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి .అయితే మంచికి వాడుకున్నామా ..?చెడుకు వాడుకున్నామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది .అయితే ప్రస్తుతం ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై ఇటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ .
ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక హోదా దగ్గర నుండి ఎన్నికల హామీల వరకు ప్రతిఒక్క విషయం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జగన్ కు సపోర్టుగా ..ప్రజల పక్షాన నిలబడకపోయిన కానీ సోషల్ మీడియా అండగా ఉంటుంది ..అయితే సోషల్ మీడియాలో ప్రజల సమస్యలపై ,జగన్ కు మద్దతుగా ఉంటున్నవారికి జగన్ కు రాజకీయ ,ఎన్నికల ప్రచార సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే శుభవార్తను ప్రకటించారు .
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జగన్ తరపున ఎందుకు పోస్టులు పెడుతున్నారు ..ప్రజల సమస్యలపట్ల ,అవినీతి అక్రమాలపై పోస్టులు పెట్టడానికి గల కారణాలను అడిగి తెలుసుకొని ..రాష్ట్రంలో ఏ నియోజక వర్గానికి చెందినవారు .ఏ మండలానికి చెందినవారు .ఏ గ్రామానికి పల్లెకు చెందినవారు ఉన్నారు అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు పేకే టీం ..అందులో భాగంగా వారికి ఎలా మద్దతుగా ఉండాలి ..వారి యోగక్షేమాలను కూడా తెల్సుకోవడానికి వారిని కలవడానికి త్వరలోనే పీకే టీం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంట .దీని ద్వారా ప్రభుత్వం నుండి ముఖ్యంగా టీడీపీ నేతలు పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దు అని భరోసా ఇస్తూ ..ఎలా సోషల్ మీడియాలో అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేయాలనే తదితర అంశాలపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు అని కూడా టాక్ .