తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నర్సింగ్ అధికారుల సంఘం వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కల్సి కోరింది .ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద ప్రాతిపదికన ,ప్రయివేట్ ఆస్పత్రులలో పనిచేస్తున్న నర్సులకు నామమాత్రపు వేతనాలు అందుతున్నాయి ..ఎక్కడ పని చేసిన కానీ కనీసం నెలకు ఇరవై వేల రూపాయలను ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ రుద్రావత్ ,భరత్ రెడ్డి ,వెంకటేష్ నిన్న గురువారం రాత్రి మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు .అంతే కాకుండా నర్సుల కోసం ప్రత్యేకంగా సంచాలకుల కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరారు ..
కేంద్ర సర్కారు సవరించిన హోదాను స్టాఫ్ నర్సు నుంచి నర్సింగ్ అధికారిగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ ఉత్తర్వులను జారిచేయాలి .నర్సింగ్ కోర్సు పూర్తిచేసుకున్న అబ్బాయిలకు నర్సింగ్ ఉద్యోగావకాశాలు కల్పించాలని కూడా కోరారు .దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి ఆ దిశగా అడుగులు వేస్తామని మంత్రి హమిచ్చినట్లు మీడియాకు తెలిపారు ఆ సంఘం ప్రతినిధులు ..అయితే గతంలోనే ఈ సంఘం ప్రతినిధులు 2016లో ఫిబ్రవరి నెల 25న సచివాలయంలో మంత్రి కేటీఆర్ ని కలసి రాష్ట్రములో నర్సెస్ బాగుగోగులకోసం నర్సింగ్ డైరెక్టరేట్ మరియు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉన్నా ఖాళీలను భర్తీ చేయాలని కోరారు .
దీంతో తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ సంబంధిత వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మరియుప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి గారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు .తాజాగా మంత్రి లక్ష్మారెడ్డి నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో సంఘం ప్రతినిధులు శ్రీను రాథోడ్ ,సుస్మిత ,లక్ష్మణ్ రుద్రావత్ ,భరత్ రెడ్డి ,వెంకటేష్ తమ సంఘం తరపున కృతఙ్ఞతలు తెలిపారు ..సమైక్య రాష్ట్రంలో గత పాలకులు ఎన్నడు ఆలోచించకపోయిన కానీ స్వరాష్ట్రంలో మా కలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలిపారు ..