టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు .ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును అని ఒక పోస్ట్ చేశారు . ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారట.
ఈ క్రమంలో సునీత పోస్టింగ్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇవాంకా ట్రంప్ పుణ్యామా అని నగరం అందంగా తయారవుతోంది. ఆరోగ్యాలు పాడవుతున్నాయి, బండ్లు దెబ్బతింటున్నాయని పలుమార్లు అరచి గీపెట్టీనా పట్టించుకోని అధికారులు ఇప్పుడు ఇవాంక కోసం గుంతలు పూడ్చి కొత్తరోడ్లు వేస్తున్నారు.
ఇంకా చాలా ప్రాంతాల్లో రంగులు, పెయింటిగ్ లు, గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇవాంక రాక కోసం ఇంత హడావుడి అవసరమా అన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇవాంక పర్యటన కోసం కోట్లు ఖర్చుచేస్తున్నారన్న అపవాదులు లేకపోలేదు.ఒక వైపు ఇటువంటి విమర్శలు వినపడుతుంటే, ఇంకోవైపు ఏదో రూపేణా నగరం బాగుపడుతోందన్న సంతోషమూ కనపడుతోంది.