పైకి చూసేందుకు ఆరోగ్యంగా కనిపించే పిల్లల్లో ఉండే పోషకాహారలోపంను తరచూ హిడెస్ హంగర్‌గా అభివర్ణిస్తుంటా, ఆ పిల్లల సరైన శారీరక మానసిక ఎదుగుదలకు పోషకాహారలోపం ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది. శిశువు మొదటి 1000 రోజుల జీవితంలో విటమిన్ ఏ, అయోడిన్, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి కీలక సూక్ష్మ పోషకాల లోపం శిశువు యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా (సరిదిద్దుకోలేని విధంగా) ప్రభావం చూపవచ్చు.
విటమిన్ ఏ, అయోడిన్, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి కీలక సూక్ష్మ పోషకాల లోపాన్ని హిడెన్ అంటుంటారు. ఈ లోపంలో ఉన్న పిల్లలు చూసేందుకు బొద్దుగా, ఆరోగ్యంగా కనిపించవచ్చు. కానీ వారిలో ఆ వయస్సుకు ఉండాల్సిన రీతిలో శారీరక, మానసిక అభివృద్ధిని సాధించడంలో విఫలం కావచ్చు. అందుకే పిల్లల కడుపునింపడం ఒక్కటే ఆహారలక్ష్యం కాదనే విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ముఖ్యం. సూక్ష్మ పోషకాలను ఏ మేరకు వారు తీసుకుంటున్నారనేది కూడా ముఖ్యమే అని అంటున్నారు వైద్యులు.
జీవితంలో మొదటి రెండేళ్ల కాలంలో చిన్నారుల శారీరక ఎదుగుదల వేగంగా వృద్ధి చెందుతుంది. గణనీయ వృద్ధి అంతా కూడా గర్భధారణ అనంతరం 34 వారాల వయస్సు వచ్చేలోగా చోటు చేసుకుంటుంది. న్యూరాన్ల మధ్య సందేశాలు ప్రసారమయ్యే సినాప్సస్ యొక్క గరిష్ట వృద్ధి ఈ కాలంలోనే జరుగుతుంది. ఆ సమయానికి శిశువు బడికి వెళ్లడం ప్రారంభమయ్యే సమయానికి సినాప్సిస్ వయోజనుల స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ అన్ని రకాల న్యూరోకాగ్నిటివ్ శారీరక అభివృద్ధి కోసం ఈ సమయంలో శిశువు సిఫారసు చేయబడిన పరిమాణంలో సూక్ష్మపోషకాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. సూక్ష్మ పోషకాల లోపం శిశు ప్రాయంలో మానసిక, శారీరక వృద్ధిని జాప్యం చేయడంతో పాటుగా యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాత వారి మేధస్సు పనిఏసే సామర్థ్యం, పునరుత్పాదకత, శరీర ఆరోగ్యం లాంటి అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది.
అయితే సంపన్న కుటుంబాలకు చెందిన వారిలో చాలమంది చూసేందుకు చక్కటి శరీర బరువుతో ఉంటారు. అటువంటి వారు సూక్ష్మపోషకాలలోపం బారిన పడే అవకాశం ఉంది. అది వారి వృద్ధికి అడ్డుగా నిలుస్తుంది. శిశువుల్లో సూక్ష్మ పోషకాల లోపానికి వివిధ అంతర్ సంబంధిత కారణాలు బాధ్యత వహించినప్పటికీ, ప్రాథమిక కారణం మాత్రం వారికి ఏ మేరకు సూక్ష్మపోషకాలు అవసరం అనే అంశంపై అవగాహన లేకపోవడం చెప్పవచ్చు. అనుబంధ ఆహారాల ద్వారా సూక్ష్మ పోషకాలను అందించాల్సిన అవసరం అధికంగా ఉన్నప్పటికీ, ప్రజలు తరచూ అలా చేయడం లేదు. మరి తల్లిదండ్రులు తమ చిన్నారులకు సంపూర్ణ పోషకాహారాన్ని ఎలా అందించగలుగుతారు? సూక్ష్మ పోషకాల లోపం బారి నుంచి తమ చిన్నారులను రక్షించుకోవడమెలా?
శిశు ప్రాయంలో సూక్ష్మపోషకాల ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే వారికి సిఫారసు చేయబడిన మొత్తాలను తల్లిపాలు సంప్రదాయక ఆహారం ద్వారా మాత్రమే పొందడం అసాధ్యం. అందుకుగాను వారి ఆహారంలో ఫోర్టిఫైడ్ ఆహారాన్ని భాగం చేయడం వంటి ప్రభావితపూరిత శాస్ర్తీయంగా చెల్లుబాటు అయ్యే పరిష్కారాల గురించి చూడాలి.
ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది చిన్నారుల ఎదుగుదల, అభివృద్ధిలపై మరింత విస్తృత, సుస్థిరదాయక ప్రభావాన్ని కనబరుస్తుందని శాస్ర్తపరంగా నిరూపించబడింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రుల సామాజిక – ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా రెండేళ్ల వరకు కూడా చిన్నారులకు అనుబంధ ఆహారంలో భాగంగా ఫోర్టిఫైడ్ ఫుడ్ సిఫారసు చేయబడుతోంది. చిన్నారులు తమ రెండో పుట్టిన రోజు జరుపుకునే వరకు కూడా వారికి సూక్ష్మ పోషకాల లోపం తలెత్తకుండా జాగ్రత్తపడాలి. పిల్లలు బొద్దుగా ఉంటూ, ఆరోగ్యంగా కనిపించడాన్ని చూసి మోసపోవద్దు. రోజువారీ ప్రాతిపదికన చిన్నారుల నిర్దిష్ట పోషకాహార అవసరాలు తీరేందుకు వారి ఆహారంలో ఫోర్టిఫైడ్ ఫుడ్‌ను భాగం చేసేలా చూసుకోవాలి.