ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే మళ్లీ ఇప్పుడు పద్మావతి సినిమాలో నటించిన దీపికా పదుకోణెకి భద్రత పెంచారు. ఆమెను హతమార్చుతామని కొందరు, ముక్కు కోస్తామని మరికొందరు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో దీపికా పదుకొణెకు భద్రత పెంచారు కూడా.
అసుల పద్మావతి సినిమా విడుదలపై ఇంత రాద్దాంతం ఎందుకు జరుగుతోంది..? పద్మావతి చిత్రం విడుదల వాయిదాకు కారణం కేంద్ర ప్రభుత్వమేనా..?, పద్మావతిపై దాడులకు కారణం బీజేపీనా..?? అన్న ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు బాలీవుడ్ సినీ నటులు. అంతేకాదు, క్రూరుడైన అల్లువుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మినీకి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ చిత్రంలో అసభ్యకరంగా చూపించారంటూ రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళన చేస్తోంది. అయితే, రాజ్‌పుత్ కర్ణిసేన కార్యక్రమాలను చేస్తొన్నది బీజేపీనే కాబట్టే.. పద్మావతిపై దాడలు జరిగాయని అంటోంది బాలీవుడ్ ప్రపంచం. దీంతో చిత్రాన్ని విడుదల చేసేందుకు నానా తంటాలు పడుతోంది పద్మావతి యూనిట్.