నగ్మా… ఒక దశలో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణి. 90ల ఆరంభంలో తెరకు పరిచయం అయిన ఈ భామ.. అతి తక్కువ సినిమాలతోనే స్టార్ అయ్యింది. తెలుగులో వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే… అదే సమయంలో బాలీవుడ్ కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ లలో ఈమె హవా నడిచింది. వీటితో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ ఒక వెలుగు వెలిగింది.
నైంటీస్‌లో దక్షినాదిన ఒక వెలుగు వెలిగిపోతున్న టైమ్‌లో.. ఒక తమిళ స్టార్ హీరోతో.. ఆ తర్వాత మరో క్రికెటర్‌తో ఎఫైర్లు నడిపిందనే వార్త అప్పట్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో నగ్మా కు భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఎఫైర్ ఉందని ఒక దశలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఉంది.. అప్పట్లో ఇదో పెద్ద చర్చనీయాంశం కూడా అయ్యింది.
ఎంతలా అంటే ఆఖరికి ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా గంగూలీని నగ్మా పేరు చెప్పి స్లెడ్జ్ చేసే వాళ్లట. ఇక నగ్మా, గంగూలీలు కలిసి శ్రీకాళహస్తిని సందర్శించుకున్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అది జరగలేదు. ఇక నగ్మాతో ఎఫైర్ పెట్టుకున్న తమిళ స్టార్ హీరో ఎవరనే చర్చ మొదలైంది. తీరా మీడియా వర్గాలనుండి ఆరా తీస్తే శరత్ కుమార్ అని.. అప్పట్లో వీరి ఎఫైర్ పై పెద్ద ఇష్యూ కూడా జరిగిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.