వైసీపీ అధినేత జగన్ పాదకయాత్ర జోరుగా సాగుతుంటే.. టీడీపీ నేతలకు ఏ దిక్కూ తోచడంలేదు. జగన్ పాదయాత్రకు ఎలాగైనా ఆటంకాలు సృష్టించడానికి తెలుగు తమ్ముళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. టీడీపీ అనుకూల మీడియాల వారు.. వైసీపీ నేతలు త్వరలోనే పార్టీ మారుతున్నారని.. అతి త్వరలోనే వారంతా టీడీపీలో చేరడం ఖాయమని.. తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజల్లో తప్పుడు సంఖేతాలు పంపిచేందుకు ట్రై చేస్తున్నారు.
అయితే ఇప్పటికే కొంత మంది నేతలు పార్టీ మార్పు పై స్పందించగా.. తాగాగా వైసీపీ పాడేరు నియోజక మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందిచారు. గత వారంరోజులుగా తాను టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు వస్తున్నాయని.. నేను పార్టీ మారడం లేదని.. అయినా ఇదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలని మీడియా పై పైర్ అయ్యారు. అయినా టీడీపీ వల్ల రాష్ట్రానికి కొంచెమైనా అభివృద్ది జరుగుతోందా.. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని.. ఆంధ్రప్రదేశ్‌ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని దానికి పేటెంట్ హక్కులు లోకేష్ తీసుకున్నారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ నిరంతరం ప్రజలకోసం కష్టపడుతున్నారని.. అయితే కొంతమంది నితిలేని నాయకులు కేవలం డబ్బులకు ఆశపడి టీడీపీలోకి వెళ్ళి జగన్ పై విమర్శలు చేస్తున్నారని.. అతి త్వరలోనే వాళ్ళకి ప్రజలే బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు. తనకి టీడీపీ నేతల వలే వెన్నుపోటు పొడవడం రాదని రాజకీయాల్లో కొనసాగినంత కాలం జగన్‌తోనే ఉంటానని ఆమె స్పంష్టం చేశారు. పార్టీ మార్పు పై కావాలనే టీడీపీ మీడియా మైండ్ గేమ్ ఆడుతూ ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తోందని.. అంతే కాంకుండా తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డితో తమకెలాంటి అభిప్రాయభేదాలు లేవని.., వచ్చే ఎన్నికల్లో తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని కుండబద్దలు కొట్టారు.