టీడీపీ నేతల హత్యా రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధమైనన దేశంలో ఉంటూ.. తమకు, ప్రజాస్వామ్యానికి సంబంధమే లేదనేలా వ్యవహరిస్తున్నారు. వారి అధికారాన్ని పెంచుకునేందుకు ప్రజలను భయపెట్టి.. బాధపెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. స్వయంగా టీడీపీ మంత్రులే హత్యా రాజకీయాలకు పాల్పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రజలు.
అనంతపురం జిల్లాలో అయితే, టీడీపీ నేతల దాడులు ఎక్కువనే అంటున్నారు ఆ జిల్లా ప్రజలు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేత భూమిరెడ్డిని ఏకంగా తహశీల్దార్ కార్యాలయానికి పిలిపించి దారుణంగా హత్య చేశారు. అయితే, ఆ హత్యకు పాల్పడింది మంత్రి పరిటాల సునీత అని అప్పట్లో పుకార్లు గుప్పుమన్నాయి. ఇప్పుడు అదే రాప్తాడులో మరో కీలక వైసీపీ నేత ధనుంజయ్ యాదవ్‌పై హత్యకు కుట్ర పన్నారు అధికార పార్టీ నేతలు. దీంతో టీడీపీ నేతల హత్యా రాజకీయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
మంత్రి పరిటాల సునీత వర్గమే ధనుంజయ్ యాదవ్ హత్యకు కుట్ర పన్నిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు కారణం గతంలో భూమిరెడ్డి హత్య ఘటనే. అయితే, ధనుంజయ్ యాదవ్ హత్య చేసేందుకు పథకం పన్నిన ముఠా హఠాత్తుగా పోలీసుల కంటపడటంతో హత్య ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. హత్యకు కుట్ర పన్నిన 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.