నల్లారి కుటుంబంలో సోదరుల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందా..అంటే అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కనుమరుగు అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా నల్లారి పొలిటికల్ ఎంట్రీ పై చర్చిలు మొదలు అయ్యాయి. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి చేరారు.
ఇక గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ విప్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మీద ఒంటికాలి మీద లేచే వారు. హెరిటేజ్ ఫుడ్స్, చిత్తూరు డెయిరీ వివాదంపై అప్పట్లో కిరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనాలే అయ్యాయి. తొలినుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఉండేవారు. అలాంటిది టీడీపీలో చేరాతానన్న సోదరుడి ఆలోచనను ఆయన మొదట్లోనే తుంచి వేయాలని అనుకున్నారట.
వైసీపీలోకి వెళ్లాలంటే తమ ఆగర్భ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. దీంతో వైసీపీ కాకుండా టీడీపీయే బెటరని కిషోర్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దీంతో కిషోర్ టీడీపీలోకి వెళ్లడంపై కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎం కిరణ్ ఏదైనా జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లడమా.. లేక బీజేపీలో చేరడమా.. అనే కన్ఫ్యూజన్లో ఉండగా.. సోదరుడు తీసుకున్న నిర్ణయం ఆయన్ను బాధించిందని సమాచారం. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న అనుమతితోనే తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.