కేవలం తనదైన పంచ్‌ల వర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని, అంతేకాక, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జబర్దస్త్‌తో అతి తక్కువ కాలంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. కేవలం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి నవ్వుకోవడం కోసమే జబర్దస్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బజర్దస్త్ షోలో మిగతా పాటిస్పెంట్ల సంగతి ఎలా ఉన్నా.. హైపర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వారు లేరనడం అతిశయోక్తి కాదు.
అంతేకాదు, ఒకానొక సమయంలో జబర్దస్త్ షో మొత్తం హైపర్ ఆది స్కిట్ మీదే నడుస్తుందన్న వార్తలు షికారు చేశాయి. అయితే, స్కిట్.. స్కిట్‌కు తన పంచ్‌ల పంథాను మారుస్తూ..పంచ్‌లలో పసను పెంచేందుకు హైపర్ ఆది తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఇందుకు నిదర్శనం నిన్న జరిగిన జబర్దస్త్ షోలో బీజేపీ పార్టీపై హైపర్ ఆది చేసిన సంచలన కామెంట్లే.
అయితే, ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీపై సంచలన డైలాగ్‌లు పేల్చి.. బీజేపీ నేతలకు మాత్రం ఎక్కడో కాలెలా చేసింది. దీంతో ఈ సినిమా అత్యంత వివాదాస్పదమైంది. అందులోనూ.. జీఎస్టీతోపాటు తమిళ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ పాలనపై భీభత్సమైన సెటైర్స్‌తో చిత్రం వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశవ్యాప్తంగా మెర్సల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్‌లో 7 శాతం వసూలు చేస్తూ వైద్యం ఉచితంగా అందిస్తుంటే.. 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న ఇండియాలో మాత్రం వైద్యం ఎందుకు ఉచితంగా అందడం లేదని హీరో ప్రశ్నలు వేశాడు.
ఇక ఈ చిత్రం విడుదల తరువాత ఇంకా వివాదాలు ఎక్కువ అవడంతో ఆ చిత్ర యూనిట్ చేతులు ఎత్తేసింది. వివాదాస్పద సన్నివేశాలు తొలగిస్తామని, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టొద్దంటూ విజయ్ అభిమానులను వేడుకుంది. చివరకు వివాదస్పద సన్నివేశాలు తొలగించడంతో రిలీజ్‌కు నోచుకుంది మెర్సల్ చిత్రం.
అలాగే, తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో హైపర్ ఆది జీఎస్టీపై తనదైన శైలిలో పంచ్‌లు వేశాడు. ఇండియాలో ఎవరికీ అర్థంకాని వాటిల్లో జీఎస్టీ రెండో స్థానంలో ఉంటే.. పెళ్లాం మొదటి స్థానంలో ఉంది అంటూ పంచ్ పేల్చాడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీపై ఇప్పటికే వ్యాపార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీని రద్దు చేయాలంటూ అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఇటు వ్యాపార వర్గాలు ధర్నా చేశారు కూడా. అయినా, పేదల అభివృద్ధికి ఉపయోగపడే జీఎస్టీని తొలగించేది లేదంటూ బీజేపీ పెద్దలు అంటున్నారు.
ఇప్పుడు ఇదే జీఎస్టీపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇష్టంగా చూసే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో హైపర్ ఆది జీఎస్టీపై పేల్చిన పంచ్ బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, వ్యాపార వర్గాలు జీఎస్టీపై చేస్తున్న విమర్శలతో సతమతమవుతున్న బీజేపీ తాజాగా కోట్లాది ప్రజలు చూస్తున్న ప్రోగ్రామ్‌లో జీఎస్టీపై పంచ్ వేయడంతో ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ విషయంపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో మరీ..!