తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే మంత్రి హరీష్ ఒక్కరోజే ముప్పై వివాహ కార్యక్రమాలకు హాజరై సంచలనం సృష్టించారు .
రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నుండి దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఇన్ని వివాహ కార్యక్రమాలకు హాజరై వధువరులను ఆశీర్వాదించారు .. ఈరోజు నుండి ముహుర్తాలు బాగా ఉండటం తో ..వివాహాలు కూడా బాగా ఉన్నయ్..దానితో మంత్రి హరీష్ రావు గారు బిజి బిజి అయ్యారు….నిత్యం ఇటు అధికారక అటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ,అధికారులతో సమీక్షా సమావేశాలతో బిజీ బుస్య్గా ఉండే మంత్రి హరీష్ సిద్దిపేట పట్టణంలో గురువారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో 16 వివాహాలకు హాజరయ్యారు..
తర్వాత సిద్దిపేట లో దాదాపు 14 వివాహాలకు హాజరై మొత్తం 30పైన వివాహాలకు వాళ్ళింట్లో బంధువుగా ఒక కుటుంబ సభ్యునిగా…వివాహాలకు హాజరయ్యారు… అందరూ ముఖ్యులే… పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,ప్రభుత్వ అధికారులు శ్రేయభిలాషులు ఇలా కొందరేంటి అందరూ మనవాళ్లే…మన వారి కుటుంబ సభ్యులే అనే ఆలోచనతో వివాహాలకు ఒక బాధ్యత గా మంత్రి హరీష్ రావు హాజరై నేటి తరం నాయకులకు ఎలా ఉండాలో ఆదర్శంగా నిలిచారు .