తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు .
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై ఐదు కోట్లతో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రెండు వందల అరవై మూడు ఇండ్లను నిర్మించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది .దీన్ని పూర్తిచేయడానికి సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ముందుకుపోతుంది .
ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనబై ఏడు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి పరిపాలనా అనుమతి లభించింది .అందులో ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల ఎనబై రెండు ఇండ్లు నిర్మాణం దశలో ఉన్నాయి .అయితే వీటిలో ఇప్పటికే ఒక లక్ష అరవై వేల ఆరు వందల పదకొండు ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయి .ఇప్పటికే నాలుగు వేల అరవై తొమ్మిది ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి .అయితే రానున్న ఎన్నికల లోపు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించి పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయాలనీ ప్రభుత్వం పక్క ప్రణాళికలతో ముందుకు పోతుంది .