టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు చంద్రబాబు మరో మరోసారి మొండి చెయ్యి చూపనున్నార.. బోండా ఆశలు మరోసారి గల్లంతు అయ్యాయా.. బోండా కనిన కలలన్నీ అడియాశలు అయ్యాయా.. అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. టీడీపీ సర్కార్ గత మంత్రి వర్గ విస్తరణలో బోండా ఉమకి చోటు దక్కలేదు. దీంతో అప్పట్లో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. దీంతో వెంటనే చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు.
దీంతో కొద్దిరోజలపాటు కామ్‌గా ఉన్నా బోండా ఉమ మళ్ళీ హుషారు అయ్యారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించకపోయినా.. తనకు చీఫ్ విప్ పదవి వస్తోందని గట్టి నమ్మకంతో ఉండగా చంద్రబాబు మాత్రం చీఫ్ విప్ పదవికి పల్లె రఘునాథ్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో బోండా ఉమ మరోసారి అసంతృప్తికి గురి అయినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన బోండా తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ చినబాబుతో కూడా సన్నిహితంగానే ఉంటారు.
అయితే బోండా ఉమ తరచూ ఏదో ఓక వివాదంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. దీంతో బోండా పై చంద్రబాబు పెద్దగా ఇంట్రస్ట్ చూపడంలేదని తెలుస్తోంది. దీంతో పాటు అన్నీ కృష్ణా గుంటూరు జిల్లాల వారికి పదవులు ఇస్తే మిగిలిన జిల్లా నేతల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తుననారట. ఈ నేపద్యంలో బోండా ఉమకు మరోసారి భంగపాటు తప్పలేదని టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. దీంతో మరోసారి బోండా ఉమ టీడీపీ అధిష్టానం పై కారాలు మిరియాలు నూరుతున్నారని.. మరోసారి బ్లాస్ట్ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి చంద్రబాబుకు వ్యతిరేకంగా బోండా నుండి ఎలాంటి రియాక్షన్ ఎదురవుతుందో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.