తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మానస పుత్రిక అయిన టాస్క్‌కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు, మెరుగైన ఉద్యోగాలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఆండ్ నాలెడ్జ్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రఖ్యాత ఏసియా ఐఎన్‌సీ 500 సంస్థ యూత్ ట్రాన్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్సలెన్సీ అవార్డు అందించింది.
టీహబ్‌లో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రోత్ కాన్‌క్లేవ్ సదస్సులో ఈ అవార్డును యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా చేతుల మీదుగా టాస్క్ సీఈఓ సుజీవ్ నాయర్ అందుకున్నారు. ఈ సందర్భంగా యూఎస్ కాన్సులేట్ జనరల్ మాట్లాడుతూ యువత జీవితాన్ని మలుపు తిప్పే వేదికగా టాస్క్ నిలవడం సంతోషకరమన్నారు. ఏసియా సంస్థ నుంచి ప్రత్యేక పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు.