గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి మంత్రి కే తారక రామారావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
2006 నుంచి సిరిసిల్ల కు చెందిన ఆరుగురు కార్మికులు గల్ఫ్ లో జైలు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
వారి పరిస్థితులను తెలుసుకొని బాధితులకు సహాయం అందించేందుకు నేపాల్ వరకు వెళ్లి స్వతహాగ ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాధితులు పెట్టుకున్నమెర్సి పిటిషన్ ను కొట్టేయడం వల్ల వారు ఇంకా జైల్లో నే ఉంటున్నారని మంత్రి వివరించారు. బాధితులను విడిపించే దిశలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంతో మాట్లాడాలని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి త్వరలోనే అబూదాబిలో పర్యటిస్తామన్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, పర్యటనలో భాగంగా గల్ఫ్ బాధితులను విడిపించే దిశలో అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని హామి ఇచ్చారని మంత్రి వివరించారు.
Tags cmo delhi kcr ktr SUSHMASWARAJ telangana trs