వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా జగన్ వద్ద కోకొల్లలుగా సమస్యలు పలుకరిస్తున్నాయి. దీంతో జగన్ ప్రజలందరికీ భరోసా కల్పించి చంద్రబాబు సర్కార్‌ని ఎండగడుతున్నారు. ఇక మరోవైపు అనేక మంది నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు.
అయితే గత కొద్ది రోజులుగా వైసీపీలోకి చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్పందించారు. పార్టీ అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారతనని తానేప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. అవన్నీ ఊహగానాలేనని.. పార్టీ మార్పుపై అవసరమొచ్చినప్పుడు స్పందిస్తానని వ్యాఖ్యనించారు. తాను ఇప్పుడు ఏ మాట్లాడినా మీడియా రాద్ధాంతం చేస్తుందన్నారు. కాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై మీ అభిప్రాయామేంటని ప్రశ్నించగా.. స్వతంత్ర దేశంలో ఒక పౌరుడిగా ఎవరైనా పాదయాత్ర చేసుకునే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు. వైసీపీలో చేరికపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.