తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .ఇప్పటికే పలుమార్లు తన దృష్టికి వచ్చిన సమస్యను అక్కడక్కడే పరిష్కరించి అండగా ఉంటూ వస్తున్నా సంగతి మనకు తెల్సిందే .తాజాగా ముఖ్యమంత్రి ప్రముఖ రచయిత కేవీ నరేందర్ అనారోగ్య పరిస్థితి గురించి తనకు తెలిసిన వెంటనే స్పందించి రూ.15 లక్షలు మంజూరు చేయడంతోపాటు నిన్న బుధవారం నాడు ఆ చెక్కును అందజేశారు. అయితే ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన సందర్భంగా నరేందర్ సమస్యను సీఎం కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.దీంతో వెంటనే స్పందించిన ఆయన రచయిత నరేందర్ వైద్యఖర్చుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేశారు.
- సీఎం కేసీఆర్ దేవుడు: కేవీ నరేందర్
వైద్యఖర్చుల నిమిత్తం తనకు ఆర్థికసాయం అందించిన సీఎం కేసీఆర్‌కు కేవీ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చయ్యాయని, ఒక మామూ లు టీచరు అయిన తనకు అంతటి ఖర్చు భరించడం సాధ్యంకాదని అన్నారు. దాంతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఎంపీ కవిత దృష్టికి తీసుకువచ్చానని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశానికి వచ్చినప్పుడు సీఎం తనను పిలిచి మాట్లాడి రూ.15 లక్షలు మంజూరు చేశారని నరేందర్ వివరించారు. నిజంగా ఆయన దేవుడు. మాలాంటి పేదోళ్లు ఎందరికో ఆయన మేలు చేస్తున్నారు. రచయితగా నేను తర్వాత రాసే పుస్తకం ఆయనకు అంకితం ఇవ్వడం తప్ప, ఈ రుణం మరోలా తీర్చుకోలేను అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు.