ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు .
ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను కురిపించారు .పాదయాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ “అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు ఆరోగ్యశ్రీని నీరు గార్చింది .ఒకప్పుడు 108కి ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ ఇరవై నిమిషాల్లోనే వచ్చేది .కానీ నేడు గంట అయిన కానీ రావడంలేదు .మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది .
ఆరోగ్య శ్రీని పేదల పాలిట వరంగా మారుస్తా .వైద్యుల సలహాల మేరకు విశ్రాంతి సమయంలో కూడా రోగులకు బ్రతకడానికి డబ్బులు ఇస్తాం ..కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ చేయించుకునేందుకు ఇబ్బందులు పడకుండా వారికి అండగా ఉంటాం ..వారికి నెల నెల పదివేల రూపాయల పించన్ ఇస్తాం ..మోకాళ్ళ మార్పిడిని ఆరోగ్య శ్రీ ద్వారా చేయిస్తామని హామీల వర్షం కురిపించారు .