ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత మీడియాతో అన్నారు .
ఆమె మాట్లాడుతూ బోటు ప్రమాదంలో చిక్కుకుని మత్స్య కారుల సహాయంతో బతికి బయటపడ్డ మా మామయ్య సీతారామయ్య ను అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు ఒడ్డున కూర్చోబెట్టారు .ఆపై ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ మృతి చెందాడు .ఇది ముమ్మాటికి సర్కారు నిర్లక్ష్యమే .మా అత్త ,మామయ్య ఇద్దరూ మృతి చెందటం మా కుటుంబానికి పెద్ద విషాదమే .ఆరేళ్ళ వయస్సున్న మా పెద్దపాప ఉజ్వల సాయిని మామయ్య విహారయాత్రకు తీసుకెళ్ళాడు .
ప్రమాదం జరిగిన సమయంలో బోటును పాప చేతిలో పట్టించి బతికేలా చేసి మా మామయ్య చనిపోయాడు .మనుమడు కావాలనే ఆరాటం ఉంది .మనుమడు పుట్టి ఆరు నెలలు కూడా నిండకుండానే ఆయన చనిపోయాడు .ఆర్ఎంపీ వైద్యుడుగా చాలా మంది ప్రాణాలను కాపాడాడు .కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మా మామయ్య మరణానికి కారణమైంది అని
ఆమె కన్నీళ్ళ పర్యాంతం అయ్యారు ..