హైదరాబాద్ లోని సుప్రసిద్ధ చార్మినార్ కు మరో అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అద్వర్యంలో ఐకానిక్ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత ను చేపట్టడం ద్వారా దేశం లోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించేందుకై దేశంలో 10 ప్రముఖ స్థలాలను ఐకానిక్ గా గుర్తించింది. ఈ పది ఐకాన్ లో చార్మినార్ ను ఒకటిగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలోని వంద ప్రముఖ ఐకాన్ నగరాలను స్వచ్ఛతకు మోడల్ గా తీర్చి దిద్దడానికి స్వచ్ఛ భారత్ మిషన్ సంకల్పించింది. దీనిలో భాగంగా మొదటి దశలో అమృతసర్ తో సహా పది ప్రాంతాలను స్వచ్ఛ ఐకాన్ గా గుర్తించింది. రెండవ దశలో చార్మినార్ తో సహా పది నగరాలను ఐకానిక్ ప్రాంతాలు గా స్వచ్ఛ్ భరత్ మిషన్ ప్రకటించింది. దీనిలో భాగంగా ఒక్కో ఐకానిక్ ప్లేస్ ను స్వచ్ఛత పరంగా సమగ్ర అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఆయా ఐకానిక్ ప్లేస్ లో చేపట్టాల్సిన స్వచ్ఛ కార్యక్రమాలపై స్థానిక పాలనా యంత్రంగం తో చర్చించి ప్రణాళిక బద్దంగా పనులు చెప్పట్టడానికి కావాల్సిన నిధులను అంధ చేస్తుంది. హైదరాబాద్ నగరం లోని చార్మినార్ ను స్వచ్ఛ్ ఐకాన్ గా రూపొందించడానికి NTPC కి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం పై చార్మినార్ తో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, చర్యలపై న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నేడు స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమీషనర్ డా బి. జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. చార్మినార్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై ఈ సమావేశంలో చర్చించారు. దేశంలోనే చార్మినార్ ను స్వచ్ఛతకు మారుపేరు గా రూపొందించడానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడం, కాల పరిమితి తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఐకానిక్ ప్రాంతాల జాబితా
1. Hyderabad – Charminar 2. Gangotri, 3. Yamunotri. 4. Mahakaleshwar Temple, Ujjain, 5. Church and Convent of St. Francis of Assissi, Goa, 6. Adi Shankaracharya’s abode Kaladi in Ernakulam, 7. Gomateshwar in Shravanbelgola, 8. Baijnath Dham, Devghar, 9. Gaya Tirth in Bihar and 10. Somnath temple in Gujarat.
Post Views: 180