నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హిరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం రూపొందింది.ఈ క్రమంలో ఈ సినీమా ను క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక 22 వ తేదీన అఖిల్ సినిమా ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 23వ తేదీన అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ విడుదల చేయాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారు.కాని వరుస సినిమాలు విడుదల పెట్టుకోవడం వలన థియేటర్స్ సమస్య తలెత్తే ఛాన్స్ వుంది. అంతేకాదు వసూళ్లపై కూడా ప్రభావం పడే అవకాశం వుంది. ఈ విషయాన్ని గురించే అల్లు అరవింద్ .. దిల్ రాజు మధ్య చర్చలు జరిగాయట. చివరికి దిల్ రాజు తన సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ను డిసెంబర్ 15వ తేదీనే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేయనున్నారని అంటున్నారు.