ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ వ్యవహారం స్వయానా టీడీపీ నేతలకే అంతు చిక్కదు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోకస్ చినబాబు పై పడింది.
ముఖ్యంగా సోషల్ మీడియాకి అయితే లోకేష్ హాట్ ఫేవరేట్. నిరంతరం తన నోటి తడబాబు వల్ల టీడీపీకి తనవంతు డ్యామేజ్ చేయడంలో ముందు ఉంటారు. గతంలోనే అనేక సార్లు తన మాటలతో చేష్టలతో.. ఏపీ పప్పుగా సెన్షేషన్ అయిన లోకేష్ తాజగా నంది అవార్డుల విషయంలో తన నోటి దూలను ప్రదర్శించి పెద్ద దుమారమే లేపారు.
ఏపీ సర్కార్ నంది అవార్డులు ప్రకటించిన తర్వాత అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. భారత రత్న నుండి చిన్నా చితక అవార్డుల వరకు రగడ జరగడం కామనే.. అయితే అనవసరంగా లోకేష్ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సినీ జనాలే కాకుండా.. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్ కూడా లోకేష్ వ్యాఖ్యల పై మండి పడుతున్నారు.
కమ్మనైన నంది అవార్డులు.. కమ్మనైన సెకిల్ అవార్డులు అంటూ తమ తమ అసంతృప్తిని ప్రదర్శిస్తున్న వేళలొ మొదట టీడీపీ అనుకూల మీడియా నుండి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు విమర్శిస్తున్నారని బ్రేకింగ్ న్యూస్‌లలో ప్రెజెంట్ చేశాయి. అయితే తాజాగా లోకేష్ నోటి నుండి కూడా ఏపీలో ఆధార్ లేని వారు.. ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డుల పై విమర్శిస్తున్నారంటూ.. లోకేష్ వ్యాఖ్యలు చేయడంతో యావత్ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది.
దీంతో లోకేష్ నిజంగానే మతి ఉండి ఆ వ్యాఖ్యలు చేశారా.. మందుతాగి వాగారా.. అన్న ఆశ్చర్యం సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమలో చాలావరకు టీడీపీ అనుకూల పరిస్థితులు వుంటాయన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు టీడీపీ అనుకూల వర్గం కూడా లోకేష్ మాటల్ని సమర్థించలేని పరిస్థితి వచ్చిందని సదరు వర్గీయులు చర్చించుకుంటున్నారు. లోకేష్ దద్ది మాటలు మరోసారి టీడీపీ కొంప మీదకు తెచ్చాయని.. సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.