ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు లేపిన కంపు దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే చెలరేగుతుంది. మూడు సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే పుండు మీద కారం చల్లినట్టు.. లోకేష్ నంది అవార్డుల రగడ మీద చేసిన వ్యాఖ్యలు పై సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది.
లోకేష్ వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్‌లో కూర్చున్నవారు ఏపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేసారా.. ఏపీలో ఆధార్, ఓటర్ కార్స్ లేని వారు ప్రత్యేక హోదా, నంది అవార్డుల గురించి విమర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో లోకేష్ అసలు నీకు ఏపీలో ఆధార్, ఓటర్ కార్డ్స్ ఉన్నాయా.. అని ప్రశ్నించారు. దీంతో మరోసారి స్పందించిన లోకేష్.. నారా కుటుంబంలో అందరికీ ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పడం.. వెంటనే టీడీపీ అనుకూల వెబ్‌సైట్లు నారా వారి ఎలక్ట్రోల్ లిస్ట్‌తో సహా ప్రచురించడం జరిగిపోయింది.
అయితే ఇక్కడ బయటపడిన అసలు నిజాలు ఏంటంటే.. నారా లొకేష్‌కు దొడ్డిదారిన మంత్రి పదవి కట్టబెట్టడం కోసం.. మంగళగిరిలొ నివాసం ఉంటున్నట్లు చూపించారు.. అది కూడా ఎప్పటి నుండో తెలుసా.. 2017 మార్చి నుండి. ఇక లోకేష్ తండ్రి అయిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి,, లోకేష్‌కి పిల్లనిచ్చిన మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి ఇప్పటి వరకు ఏపీలో అడ్రసేలేదు. అయితే లోకేష్ మాత్రం ఆంద్రాలో ఆధార్ లేనోడు ప్రశ్నించకూడదని తాగుబోతులా వాగుతున్నాడు. ఇక్కడ ప్రజలు ప్రశ్నించేది ఏంటంటే.. ఆధార్ లేని బాలకృష్ణ ఎమ్మెల్యే అవ్వొచ్చా.. ఏపీలో ఆధార్ లేని చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వొచ్చా.. అయ్యా సిగ్గుమాలిన లోకేష్ బాబు వీటన్నిటికి ముందు సమాధానం చెప్పు.. లేదా లెంపలేసుకుని ఏపీ ప్రజలందరినీ క్షమించ మని అడుగూ.. అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.