జగన్ ప్రారంభించిన పాదయాత్రలో ఒకవైపు జనం సమస్యలను కళ్ళారా చూసి తెలుసుకుంటున్న జగన్.. మరోవైపు వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచక పాలన పై తనదైన శైలిలో ఎండగడుతూ.. టీడీపీ బ్యాచ్‌కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ బేతంచర్ల రోడ్ షోలో బాగంగా నిర్వహించిన సభలో జగన్ కురిపించిన వరాల జడివాన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
జగన్ మాట్లాడుతూ.. ఏపీలో మన ప్రభుత్వం వచ్చాక ప్రజలు చేయాల్సింది ఒక్కటే.. మీ పిల్లల్ని బడికి పంపించండి చాలు… వారు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా నేను తోడుగా ఉంటానని జగన్ అన్నారు. నేను ఊరికే మాటలు చెప్పను.. తాను మేనిఫెస్టోలో ఏది పెడితే అది ఖచ్చితంగా అమలు చేస్తానని జగన్ అన్నారు. అంతే కాకుండా… ఎలాంటి జబ్బు కైనా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయించుకునే ఏర్పాటు చేస్తానని 108 కి ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో వచ్చేలా చేస్తానని జగన్ సంచలన ప్రకటన చేయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.. టీడీపీ బ్యాచ్ అయితే బిత్తర పోతున్నారని సర్వత్రా చర్చిచుకుంటున్నారు.