తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల విషయాలూ చర్చలు జరిపారు. వీటి విషయంలో తాను అన్ని విధాలుగా సహకరిస్తామని గడ్కారీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా హరీశ్.. కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిని కూడా కలుసుకున్నారు.
