Home / MOVIES / ఇండస్ట్రీలో చాలా మంది.. నేను ఒప్పుకోలేదు.. నా మేనేజ‌ర్లు మాత్రం న‌న్ను..?

ఇండస్ట్రీలో చాలా మంది.. నేను ఒప్పుకోలేదు.. నా మేనేజ‌ర్లు మాత్రం న‌న్ను..?

తెలుగు సినిమాల్లోకి పుష్క‌ర‌కాలం క్రితమే హీరోయిన్ అర్చ‌న‌ ఎంట్రీ ఇచ్చినా.. అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా తెలుగు బుల్లితెర పై దూసుకు వ‌చ్చిన బిగ్‌బాస్ షోతో మాంత్రం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన అర్చ‌న త‌న మేనేజ‌ర్ల గురించి కొన్ని ఆశ‌క్తి వార్త‌లు చెప్పింది.

అర్చ‌న మాట్లాడుతూ.. నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డాను.. నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు. దీంతో, అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా హీరోయిన్లు లేదా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునే వారు. నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకునేవారు.

అయితే ఇప్పుడు మాత్రం నాకు మేనేజ‌ర్లు ఎవ‌రు లేర‌ని.. నేనే, డైరెక్ట్‌గా మాట్లాడుకుంటున్నాన‌ని అర్చన తెలిపింది. చాలా మంది పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారని, తన ఆలోచనా విధానం మాత్రం అలా ఉండదని, మానసికంగా చూస్తే తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని చెప్పింది. అభద్రతా భావంతో ఉండను. ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న వ్యక్తిని నేను. నన్ను నేను చాలా గౌరవించుకుంటాను. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్. మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటాను.

ఇక సినిమా ఇండస్ట్రీలో నేను ఇంత వరకూ ఎవరికి ప్రపోజ్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే, నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను. సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ, వాళ్ల నిజాయతీ, నిబద్ధత గురించి అనుమానం వచ్చింది. నేను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. నిజానికి అందమూ నటనా రెండూ ఉన్నా సరైన ప్లానిగ్ లేకపోవటం, మంచి పాత్రలను చూసుకోకపోవటం వల్లనే వెనుకబడి పోయిందని జ‌నాలు అనుకుంటున్నారు.. అయితే అర్చ‌నకి అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి అస‌లు కార‌ణం మేనేజ‌ర్లు అన‌మాట‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat