తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అంబేడ్కర్ విగ్రహాకమిటీ తుదిరూపం ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాకమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం మధ్యాన్నం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంవేషమై అంతిమనిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైయిన్ అసోసియట్స్ రూపొందించిన నమూనాలను పరిశీలించిన మీదట విగ్రహం నెలకొల్పనున్న ప్రాంతంలో నిర్మించతలపెట్టిన భవనసముదాయానికి, పార్క్ ఆమోదం తెలిపింది. అయితే అదే సమయంలో అక్కడ ఎటువంటి ప్రతిమ పెట్టాలన్న విషయంలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు వదిలి పెట్టాలని కమిటీ నిర్ణయించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌సభ ప్రాంగణంలో ఉన్న విగ్రహ నమూనాతో పాటు రాష్ట్ర రాజధాని నగరంలోని ట్యాంక్ బండ వద్ద ఉన్న విగ్రహాన్ని అదే సమయంలో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్ కళాశాలకు చెందిన శిల్పి బోళ్ళ శ్రీనివాసరెడ్డి రూపొందించిన మూడు విగరహాలప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట ఉంచాలని కమిటీ నిర్ణయించింది. కాగా నేడు జరిగి సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాకమిటీ చెయిర్మన్ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,మరో ఉపముఖ్యమంత్రి మహాముద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,గుంటకండ్ల జగదీష్ రెడ్డి,బుద్దవనం అభివృద్ధి చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర యస్.సి అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా,గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.యస్ ప్రవీణ్ కుమార్, యస్.సి అభివృద్ధి శాఖా డైరెక్టర్ కరుణాకర్,రోడ్లు భవనాలశాఖ ఇంజినీరింగ్ నిపుణులు గణపతి రెడ్డి జే.ఎన్.టి.యు ఫైన్ ఆర్ట్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కవిత అదే విశ్వ విద్యాలయానికి చెందిన శిల్పి బోళ్ల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 198