మూడుముళ్ళతో ఒక్కటై ..అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచిన తన భర్తను భార్య అతికిరాతకంగా హత్యచేసింది .అక్కడితో ఆగకుండా ఆ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని తన ఇంట్లోనే ఒక మూలాన పెట్టి మరి ఇటుకలతో ఏకంగా గోడను కట్టేసింది .అసలు విషయానికి వస్తే అమెరికా దేశంలో ప్లోరిడాకు చెందిన అరవై ఐదేండ్లున్న బార్బరా వోజియాక్ అనే మహిళ తన భర్త అయిన డెబ్బై రెండేండ్ల ఆల్సేడ్ వోజియాక్ ను హత్య చేసింది .
అందులో భాగంగా ఒక తుపాకితో కాల్చి మరి చంపింది .ఆ సమయంలో కాల్చడంతో బుల్లెట్ తలలోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడక్కడే మరణించాడు .ఈ విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని టేపుతో చుట్టి ఇంట్లోనే ఒక మూలాన పెట్టి ఇటుకలతో గోడను కట్టేసింది .అయితే అనుమానం వచ్చిన ఇంటి ప్రక్కన ఉండే స్థానికుడు పోలీసులకు పిర్యాదు చేశాడు .
ఇంట్లో హత్య జరిగింది .బుల్లెట్ శబ్దం వచ్చింది .ఇంట్లో తనిఖీ చేయాలనీ సదరు వ్యక్తీ ప్లిసులకు పిర్యాదు చేశాడు .దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీ చేయగా ఇటుకలతో ఉన్న గోడ కన్పించడంతో అనుమానం వచ్చి దాన్ని పగులకోట్టడంతో మృతదేహం బయటకు వచ్చింది .దీంతో ఆమెను అరెస్ట్ చేసి విచారించగా తన భర్త తనను హత్య చేయడానికి ప్రయత్నించాడు .అందుకే చంపేశాను అని ఆమె తెల్పింది .