గత మూడు రోజులుగా టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటివద్ద తన రెండేళ్ల కూతురితో కలిసి సంగీత ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిత్య పెళ్లికొడుకు శ్రీనివాస్ రెడ్డికి టీఆర్‌ఎస్ షాకిచ్చింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు బోడుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరెడ్డి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి రెండో భార్య సంగీతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీయిచ్చారు.
మరోవైపు సంగీతకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సంగీతకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆయన వెనుదిరిగారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. ఇంటికి తాళం వేసి అత్తమామలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది.