చంద్రబాబు సర్కార్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికంతటికీ కారణం ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరో వైపు పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తీరేనంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రుల వైఫల్య నిర్ణయాలతో ప్రభుత్వాధికారులు తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో వరుస ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి.
అయితే, ప్రస్తుతం చంద్రబాబు కేబినేట్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మంత్రి ఎవరయ్యా అంటే వెంటనే గుర్తుచ్చే పేరు అఖిల ప్రియ.
విజయవాడ పవిత్ర సంగమం వద్ద చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి కారణం పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న అఖిలప్రియ అని, పర్యాటకశాఖపై అఖిల ప్రియకు అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర మంత్రులతో అనడం గమనార్హం. ఆ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని, అయినా, ఓటు బ్యాంకు కోసం మరీ ఇంతలా దిగజారి మంత్రిత్వశాఖలపై అనుభవం లేని వారికి మంత్రి పదవి ఇస్తే ఇలానే ఉంటుందని వారిలో వారే చర్చించుకుంటున్నారు కేబినెట్ మంత్రులు.
అలాగే, గత ఆదివారం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన సోషల్ మీడియా సమ్మిట్ – 2017 అవార్డుల కార్యక్రమం మంత్రి అఖిల ప్రియకు మరో వివాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే, ఆ కార్యక్రమంలో అత్యంత ప్రజాదారణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడే సమస్య మొదలైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో టాలీవుడ్ నటులకు అవార్డులు ఇవ్వాలి కానీ.. బాలీవుడ్ నటులకు ఎలా ఇస్తారు? అంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ విషయంపై నెటిజన్లు వారి ఆగ్రహావేశాలను సోషల్ మీడియా ద్వారా తెలుతుపున్నారు. ఇప్పటికే పద్మావతి సినిమా ద్వారా వివాదాల్లో ఉన్న దీపికా పదుకొణెకు అసలు అవార్డు ఎలా ఇస్తారు? ఆమె స్థాయి అంతటి నటులు టాలీవుడ్‌లో లేరా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఏది ఏమైనా పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న అఖిలప్రియ బోటు ప్రమాదంపై విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. సోషల్ మీడియా సమ్మిట్ – 2017 అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొని మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నారని చర్చించుకుంటున్నారు ప్రజలు.