ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్‌కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వదల్లేదని, అలాగే వికలాంగులు తమను చంద్రబాబు ప్రభుత్వం మరిచిందంటూ వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా అటుగా వస్తున్నారని తెలుసుకున్న ఓ చిన్నారి జగన్ సార్.. జగన్ సార్ అంటూ కేకలు వేయడంతో.. చిన్నారిని గమనించిన వైఎస్ జగన్ స్పందించి.. చిన్నారి మాటలు వినేందుకు కొద్దిసేపు ఆగాడు.
మా అమ్మకు ఉద్యోగం పోయింది సార్, ఏమైందనమ్మా.. మీ అమ్మ ఎక్కడ పనిచేస్తుంది అంటూ జగన్ ప్రశ్నించగా.. మా అమ్మ కస్తూర్భా హై స్కూల్‌ల్లో పనిచేస్తుంది సార్.
జగన్ : కస్తూర్బా హై స్కూల్లో మీ అమ్మ పనిచేస్తుందా..?
చిన్నారి: తీసేసినారు సార్.
చిన్నారి: ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసేసినారు సార్.
చిన్నారి: కస్తూర్భా హై స్కూల్లో అటెండర్ సార్
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే అమ్మా.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి గత ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కస్తూర్భా స్కూల్‌లో మంచి మంచి సౌకర్యాలు కల్పించి.. సిబ్బందికి నెలానెలా జీతాలు అందేలా చూస్తామన్నారు వైఎస్ జగన్.