అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనయురాలు అయిన ఇవంకా మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ను వస్తున్నారు .హైదరాబాద్ మహానగరం వేదికగా జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో అమెరికా దేశం తరపున ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు .ఆమె భద్రతకోసం నగరంలో కట్టుదిడ్డమైన చర్యలు తీసుకుంటున్నారు .
ఈ సదస్సులో ఇవంకా తోపాటుగా పలు దేశాల ప్రముఖులు కూడా హాజరవుతుండంతో సర్కారు పలు చర్యలను తీసుకుంటుంది .ఈ తరుణంలో నగరంలో ఇవంకా కోసం ప్రత్యేకించి వంటకాలను తయారుచేస్తున్నారు . ఈ క్రమంలో ఆమెకు పలు రకాల వంటలతో డిన్నర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం .అందులో భాగంగా ఈ నెల నవంబర్ 29న నగరంలోని గోల్కొండ కోట వేదికగా ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ డిన్నర్ ఇవ్వనున్నారు .
ఈ డిన్నర్ లో హైదరాబాద్ ,తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పతర్ కా గోస్ట్ ,షీర్ కుర్మా ,డబుల్ కా మీఠా వంటి పలు రకాల వంటలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం .హైదరాబాద్ లో ప్రత్యేకమైన బగారే బైగాన్ ,దమ్ కి బిర్యానీ ,కుంబానీ కా మీఠా ,ఇరానీ చాయ్ ,పలు కూరలు ,వంటకాలను తయారుచేయాలని నగరంలోనే పేరుగాంచిన చెఫ్ లకు ఈ భాద్యతలు అప్పజెప్పారు .వీటితో పాటుగా ఇండియన్స్,చైనీస్ ,ఫ్రెంచ్ ,గ్రీక్ ,ఇటాలియన్ మరియు కరేబియన్ వంటి వంటకాలను తయారుచేయనున్నారు .