ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తారా.. నంది అవార్డులు ఏమైనా నీ యబ్బ సొత్తా.. అని విరుచుకు పడ్డారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి.. టీడీపీ అధికారంలోకి రాగానే.. చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు కదా.. వారి చేత రాజీనామా ఎందుకు చేయించలేదు.. ఒక పార్టీ పై గెలిచిన ఎమ్మెల్యేలని టీడీపీలోకి తీసుకుని వారికి పసుపు కండువాలు కప్పి, వారిని కౌగిలించుకొని ముద్దులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని పోసాని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా అది జగన్ కష్టమని అరుస్తుంటే.. మీ బాబు చంద్రబాబు ఫిరాయింపుదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు ఏపీకి లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అనీ, తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి అయినా.. సినీ పరిశ్రమని ఎలా గౌరవించాలో తెలుసుకోవాలని పోసాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.