ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు మీరు ఇక్కడ వైసీపీని గెలిపించారు. గెలిపించిన ప్రజలకోసం మనం మంచిగా ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు . కనుక తప్పకుండా డోన్ ప్రజలకు హామి ఇస్తున్న డోన్‌ను మోడల్ నియోజకవర్గం చేస్తాం, హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తామని బేతంచర్ల సభలో వైఎస్ జగన్ ప్రకటించాడు.
మరోపక్క ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.
ఇది డోన్ నియోజకవర్గం పరిస్థితి ఏంటి?
* డోన్ నియోజకవర్గంలో బేతంచర్లతోపాటు పలు ప్రాంతాల్లో నాపరాయి, కలర్ స్టోన్ పరిశ్రమలు చాలా ఉన్నాయి
* ఒక్కో నాపరాయి పాలిషింగ్ యూనిట్ పెడితే 25మందికి ఉద్యోగాలు వస్తాయి
* నాపరాయి పరిశ్రమలు పెట్టుకొని ఇక్కడ చాలామంది ఉపాధి పొందుతున్నారు
* బాబు అనాలోచిత పాలన వల్ల ఇక్కడి పరిశ్రమలు దెబ్బతింటున్నాయి
* బాబు సీఎం రాకముందే కరెంటు బిల్లు యూనిట్‌కు రూ. 3.75 ఉండేది
* యూనిట్‌కు నాలుగు రూపాయలు ఉన్న చార్జీలను దివంగత నేత వైఎస్సార్ హయాంలో రూ. 3.75 లకు తగ్గించారు.
* కానీ, బాబు సీఎం అయ్యాక యూనిట్ విద్యుత్ చార్జీని ఏకంగా ఎనిమిది రూపాయలకు పెంచారు
* ఇక ఏ రకంగా ఇక్కడి పరిశ్రమలు బతుకుతాయి? ఏ రకంగా ప్రజలు బతుకుతారు?
* సీవరేజ్ చార్జీలు రూ. 18 నుంచి రూ. 55కు పెంచాడు. రాయల్టీలను గణనీయంగా పెంచారు
* దీంతో ఇక్కడ ఉన్న ఐదారు వందల పాలిషింగ్ యూనిట్లలో సగం మూతపడే పరిస్థితి వచ్చింది
* నాపరాయి పరిశ్రమ ఆధరంగా ఇక్కడ ఉపాధి పొందుతున్న వాళ్లలో ఎక్కువమంది బీదవాళ్లు, ఎస్సీలు
* కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, పాలన, కారణంగా పరిశ్రమలు మూతపడి..
* ఇక్కడ 20వేలమంది బీద కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది
* ఇక్కడి పరిశ్రమలను కాపాడుకోవడం తెలియని చంద్రబాబు మళ్లీ..
* తాను సింగపూర్, జపాన్, చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తానంటూ బడాయి చెప్తున్నారు
* కొత్తవి కథ దేవుడి ఎరుగు ఉన్నవి మూతపడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు
* డోన్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం సాగు కూడా లేదు
* గ్రామాలకు తాగునీరు లేదు. నాన్నగారి పాలనలో డోన్ ప్రాంతానికి, డోన్ టౌన్‌కు
* నీళ్లు ఇవ్వాలని రూ. వంద కోట్లతో గాజులదిన్నె నుంచి పైప్‌లైన్ ద్వారా నీళ్లు ఇచ్చారు
* కేఈ కృష్ణమూర్తి ఇక్కడ ఎన్నోసార్లు గెలిచారు
* అవుకు నుంచి నీళ్లు పంపు చేసి ఈ ప్రాంతానికి ఇస్తానని కేఈ హామీ ఇచ్చాడు.
* కానీ ఆ పెద్దమనిషి ఇచ్చిన హామీని సైతం చంద్రబాబు పట్టించుకోవడం లేదు
* సాగుకు, తాగడానికి నీళ్లు లేక ఇక్కడ రైతులు, ప్రజలు అల్లాడుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడు అని వైఎస్ జగన్ అన్నారు.
పైన ఉన్న ప్రతి సమస్యను మేము అధికారంలోకి రాగనే తీరుస్తామని బేతంచర్ల సభలో వైఎస్ జగన్ ప్రకటించాడు.